ప్రజా ప్రభుత్వంలో చెంచులకు ప్రత్యేక గుర్తింపు

ప్రజా ప్రభుత్వంలో చెంచులకు ప్రత్యేక గుర్తింపు

👉చెంచు కుటుంబాలకు అన్ని వసతులతో ఇందిరమ్మ ఇండ్లు 

👉 చెంచు కుటుంబాలకు ప్రత్యేకంగా 177 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..

👉 ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

నేటి ఇజం -పెద్దేముల్ :ప్రజా ప్రభుత్వంలో చెంచులను ప్రత్యేకంగా గుర్తించి వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడ్పాటు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో గల ప్రతి చెంచు కుటుంబానికి అన్ని వసతులతో కూడిన పక్కా ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు.

తాండూరు నియోజకవర్గ చెంచు కుటుంబాలకు ప్రత్యేకంగా 177 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అందులో భాగంగా పెద్దేముల్ మండలంలో చైతన్య నగర్ కు 163,బషీరాబాద్ మండలంలోని నీళ్ళపల్లి గ్రామనికి 14 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణనికి శుక్రవారం పెద్దేముల్ మండలంలోని చైతన్య నగర్ గల ప్రభుత్వ భూమిని పరిశీలించి, పూర్తి స్థాయి లో చెంచులకు అవసరమైన అన్ని వసతులతో ఇందిరమ్మ కాలనీ నిర్మించాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చైతన్య నగర్ చెంచు కుటుంబ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *