తాండూరు – పెద్దేముల్ – బీదర్ బస్సు సర్వీసు ప్రారంభం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో బీదర్ కు మెరుగైన రవాణా సౌకర్యం
– బస్సు సర్వీస్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టిపిసిసి మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్
నేటి ఇజం-పెద్దేముల్: తాండూరు- పెద్దెముల్- జహీరాబాద్ మీదుగా బీదర్ వరకు బస్సు సర్వీసును శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సు కు పూజలు నిర్వహించి ప్రారంభించారు, గతంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ఆర్టిసి డిపోకు వెళ్లినప్పుడు తాండూరు పట్టణం నుండి బీదర్ పుణ్య క్షేత్రనికి వెళ్లడానికి బస్సు సర్వీసును ప్రారంభించాలని అంతర్ రాష్ట సర్వీను తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావాలని తాండూరు డిపో మేనేజర్ సురేష్ తో అలాగే రీజినల్ మేనేజర్ తో మాట్లాడి తాండూరు పట్టణం నుండి బీదర్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించడంతో నేడు బీదర్ బస్సు సర్వీసును ప్రారంభించడం సంతోషకరమని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో తాండూరు డిపో నుండి బీదర్ వరకు వయ పెద్దేముల్, కుంచారం, జహిరబాద్ మీదుగా బస్సు సౌకర్యం కల్పించడం వల్ల పెద్దేముల్, బంటారం, ధరూర్, కుంచవారం, తదితర మండల ప్రలకు సౌకర్యంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు, తాండూరు నుండి బీదర్ బస్సు ను తాండూరు నియోజకవర్గం లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు,
తాండూరు నుండి బీదర్ కు బస్సు వేళలు
తాండూరు నుండి ఉదయం 6 గంటలకు, మధ్యానం 1-30 కు, బీదర్ నుండి తాండూరు కు ఉదయం 9-30 . సాయంత్రం 5 గంటలకు బస్సు సౌకర్యం ఉండనుందని అన్నారు, ఈ బస్సు సౌకర్యానికి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో టిపిసిసి మైనార్టీ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపధ్యక్షుడు నల్ల ఎల్లారెడ్డి, నాగులపల్లి గడం శేఖర్ పటేల్, శ్రీను, ఎర్ర రవి, డి.వై.అరవింద్, పడగల రాజు తదిరులు పాల్గొనారు.

