అయ్యో! ఎరుకుల వెంకటమ్మా?

అయ్యో! ఎరుకుల వెంకటమ్మా?

👉 పరుల మరుగుదొడ్ల దుర్వాసననే- తన సుగంధ సువాసన పరిమళాలు

👉 మురుగు కాలువలు తీస్తూ ఫోజులిచ్చే నాయకులు ఎక్కడా?

👉 మరుగుదొడ్ల సెప్టిక్ ట్యాంక్ లను శుభ్రం చేసే వెంకటమ్మ ఎక్కడా??

👉గుడిసెలోకి నీరు చేరడంతో దిక్కుతోచని పరిస్థితి

👉 గత 3 రోజులుగా నిద్రలేని రాత్రులు

👉 చంటి బిడ్డలను సైతం సంకలో వేసుకుని జోకొట్టిన వైనం

👉 ఇందిరమ్మ కమిటీకి కనిపించని ఎరుకల వెంకటమ్మ గుడిసె?

👉 ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వెంకటమ్మ పేరుకు ఎందుకు అడ్డంకులు?

నేటి ఇజం -తాండూరు : గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, స్వాతంత్ర దినోత్సవం, పచ్చదనం- పరిశుభ్రత తదితర కార్యక్రమాలలో ఏదో మొక్కుబడిగా! ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు కూడా చీత్కరరిస్తూ శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఫోజులు ఇచ్చే నాయకులు గాని…. సొంత మన ఇళ్లలోనే ఏదైనా దుర్వాసన వస్తే లేదా నిత్యం కాళ్లకృత్యాలకు మనం వాడుకునే మన బాత్ రూమ్ లు కూడా మనం శుభ్రం చేయాలంటేనే… అమ్మో నేను శుభ్రం చేయాలా? అంటూ ఎన్నో విధాలుగా ఆలోచించే మనం ఎక్కడా?? తాండూరు నియోజకవర్గమే గాక పక్కనున్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ తదితర ప్రాంతాలలో ఎక్కడ సెప్టిక్ ట్యాంకులు నిండినా కూడా మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే పేరు ఎలుకల వెంకటమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్… మొక్కవోని దీక్షతో.. పరుల మరుగుదొడ్ల దుర్వాసణనే… సుగంద పరిమళాలుగా మలుచుకుంటూ సమాజ సేవకై పరితపిస్తున్న ఎరుకల వెంకటమ్మ నేడు ఇదే తాండూరు పట్టణంలోని మార్కండేయ కాలనీ లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు ముంచెత్తిన గుడిసెలో గత 3 రోజులుగా నిద్రాహారాలు మానుకొని జీవిస్తూ సహాయం కోరుతూ వేడుకుంటున్న దుస్థితి! నెలకొన్న పరిస్థితి.?

తాను చేస్తున్న వృత్తిని దైవకార్యంగా భావిస్తూ నేడు సమాజంలో పరిశుభ్రత అనే పదానికి అసలు సిసలైన నిర్వచనంగా మారిన ఎరుకల వెంకటమ్మ గత 3 రోజులుగా తాండూరు పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు గుడిసెలోకి నీరు చేరి కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేని అచేతన స్థితిలో!చంటి బిడ్డలను సంకలో వేసుకొని నిద్ర పుచ్చుతున్న వైనం… నాయకుల -అధికారుల అసమర్ధతకు నిదర్శనం. నేటికీ ఎరుకల వెంకటమ్మ పూరి గుడిసెలో నివసిస్తున్నా కూడా ప్రజా ప్రభుత్వం- ప్రజా పాలనలో భాగమైన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు రాకపోవడం గమనార్వం. ఇప్పటికైనా సంబంధిత నాయకులు, అధికారులు స్పందించి ఎరుకల వెంకటమ్మకు ప్రభుత్వ సంక్షేమ ద్రాక్ష ఫలాలు అందేందుకు కృషి చేయాలని పలువురు కాలనీవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.