రేపే కీళ్ళు-ఎముకల ఉచిత వైద్య శిబిరం!

రేపే కీళ్ళు-ఎముకల ఉచిత వైద్య శిబిరం
👉ఉచిత బిఎండి పరీక్ష ద్వారా ఎముకల పటుత్వం తెలుసుకొండి!
👉డా!జి. వినయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి
👉 ఈశ హాస్పిటల్ డైరెక్టర్ ప్రహ్లాద్ గంగిమళ్ళ
నేటి ఇజం :తాండూరు :: తాండూరు పట్టణంలోని ఈశ హాస్పిటల్ ఆధ్వర్యంలో డా. జి. వినయ్ కుమార్ పర్యవేక్షణలో కీళ్ళు – ఎముకల ఉచిత వైద్య శిబిరాన్ని రేపు అనగా బుధవారం మార్చి 25వ నిర్వహించే ందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఈశ హాస్పిటల్ డైరెక్టర్ ప్రహ్లాద్ గంగిమళ్ళ తెలిపారు. హాస్పిటల్ డైరెక్టర్ ప్రహ్లాద్ గంగిమళ్ళ మాట్లాడుతూ ముఖ్యంగా ₹1800 విలువగల బిఎండి ఉచిత పరీక్ష ద్వారా ఎముకలలో పటుత్వం ఎంతుందో ఉచితంగా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.అలాగే ఈ వైద్య శిబిరంలో కీళ్ల నొప్పులు, మోకాళ్లు, నడుము, వెన్నునొప్పి, ఎముకలో బలహీనతలకు, ఎముకల ఇన్ఫెక్షన్, పుట్టుకతో వచ్చే అంగ వైకల్యం, వంకరగా అతికిన ఎముకలకు, వెన్నుపూస జరగడం తదితర సమస్యలతో బాధపడుతున్న వారందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *