మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీదే.?

మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీదే?

👉 36వ వార్డు కాంగ్రెస్ నాయకులు స్రవంతి సంతోష్ కుమార్

నేటి ఇజం తాండూరు :: రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని 36 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్రవంతి సంతోష్ కుమార్ అన్నారు. అలాగే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అదేవిధంగా తాండూరు పట్టణం సైతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ గత శాసనసభ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ కేటాయించాలని మనవి చూశారు. నిత్యం వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ కోసం కష్టపడుతున్నామని రానున్న మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో అవకాశం కల్పిస్తే ప్రజా సేవలో ఉంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *