రోహిత్ అన్న ఆశీర్వాదంతో బరిలోకి! 

రోహిత్ అన్న ఆశీర్వాదంతో బరిలోకి! 

👉 వార్డు కనీస సౌకర్యాల కల్పన – అభివృద్దే ధ్యేయం 

👉34వ వార్డ్ బి ఆర్ ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్

నేటి ఇజం తాండూరు: 34వ వార్డు లోని కనీస సౌకర్యాల ఏర్పాటుకు- వార్డు అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తానని 34వ వార్డు బిఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆశీర్వాదంతో త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పటేల్ కరుణాకర్ మాట్లాడుతూ వార్డ్ నెంబర్ 34 లోని వందలాది బోగస్ ఓటర్లను తొలగించాలని అధికారులకు సూచించారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా! ఎల్లప్పుడూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని కావున 34 వ వార్డు ప్రజలు ఒకసారి కౌన్సిలర్ అవకాశం కల్పించాలని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *