మున్సిపల్ ముసాయిదా.. మురికి కూపం?
👉కలగూర గంపలా మారిన వైనం?
👉 జిల్లా కలెక్టర్ కు బీఆర్ఎస్ నాయకుడి ఫిర్యాదు
👉 పదుల సంఖ్యలో లేని ఎస్టీలు నేడు వందలకు ఎలా చేరారు.
👉 ఎస్టి రిజర్వేషన్ కొనసాగించాలనే తాపత్రయమా?
👉 బిఆర్ఎస్ నాయకుడు అంజద్ ఖాన్
నేటి ఇజం తాండూరు:: తాండూరు మున్సిపల్ ముసాయిదా జాబితా మురికి కూపంలా మారి కలగూర గంపలా మారిందని 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు అంజద్ ఖాన్ ఆరోపించారు.ముసాయిదా జాబితాలో తప్పుల తడుక ఓటర్లను సవరించిన అనంతరమే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, తాండూరు మున్సిపల్ కమిషనర్ తదితర శాఖలలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 3 వార్డులో కొందరు అనర్హులు ఓటరు జాబితాలో నమోదై ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే ఇంటి నెంబర్ పై అత్యధిక ఓటర్లు నమోదై ఉన్నారని అన్నారు. వీరు గత పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారని అందుకు పూర్తి ఆధారులు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉండి, మరోసారి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఓటర్ల వల్ల వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం ఉందని, కావున ఈ ముసాయిదా జాబితాను సవరించాలని పేర్కొన్నారు. వార్డ్ నెంబర్ 3లో ఎస్టీలు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉంటే…. ఎలాగైనా వార్డును ఎస్టి రిజర్వేషన్ కొనసాగేవిధంగా గ్రామాల్లోని ఎస్టి ఓట్లను వందల సంఖ్యలో చేర్చడం వలన తాండూరులోని అత్యధిక ఎస్టీలు ఉన్నారని ఎన్నికల అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా కొందరు నాయకులు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

