సల్లంగా సూడమ్మా! దుర్గమ్మ.

సల్లంగా సూడమ్మా! దుర్గమ్మ.

👉నవరాత్రి ఉత్సవాలలో బిజెపి నాయకులు  జగదీశ్

నేటి ఇజం -తాండూరు : నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తాండూరు సాయిపూర్ హనుమాన్ దేవాలయం దగ్గర ప్రతిష్టించిన అమ్మవారిని బిజెపి నాయకులు కురువ జగదీష్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కురువ జగదీష్ మాట్లాడుతూ సాయిపూర్ తో పాటు తాండూరు ప్రాంత ప్రజలందరూ ముఖ్యగా రైతులకు పాడి పంటలు బాగా పండాలని ఎప్పుడూ సుఖ: సంతోషాలతో ఉండేలా అమ్మవారి దీవెనలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిపూర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *