మానవత్వం చాటుకున్న ఆర్బిఓఎల్ శీనన్న
👉ప్రమాదలో గాయపడిన వ్యక్తికి సహాయం
👉చికిత్సకు డబ్బులు ఇచ్చి ఆటోలో ఆసుపత్రికి తరలింపు
👉 హర్షం వ్యక్తం చేసిన వాహనదారులు
నేటి ఇజం తాండూరు : తాండూరు పట్టణం ఇందిరా చౌక్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అటుగా వెళ్తున్న ఆర్ బి ఓ ఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కారులో నుండి దిగి బాధితుడికి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే శనివారం తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చూసి చలించిపోయిన ఆర్బిఓఎల్ శ్రీనివాస్ రెడ్డి బాధితుడికి ధైర్యం చెబుతూ దగ్గరుండి చికిత్స నిమిత్తం సొంత డబ్బులను ఇచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పట్ల తక్షణం స్పందించి సహాయపడిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ బి ఓ ఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి పలువురు వాహనాదారులు అభినందనలు తెలిపారు.

