రేపు హిందూ భవన నిర్మాణ శిలాఫలకం

 👉ఎమ్మెల్యే సహకారంతో 50 లక్షల నిధులు

👉 ప్రతి హిందూ హైందవ ధార్మిక సోదరులకు ఆహ్వానం

👉హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు

నేటి ఇజం -తాండూరు : తాండూరు పట్టణ ఖంజాపూర్ గేట్ సమీపంలోని హిందూ ఉత్సవ సమితికి చెందిన స్థలంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హిందూ భవన నిర్మాణ శిలాఫలకం వేయనున్నట్లు తాండూరు హిందూ ఉత్తర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ హిందూ భవన నిర్మాణ శిలాఫలకం కార్యక్రమానికి తాండూరు ప్రాంతంలోని అన్ని హిందూ కుల సంఘాలు, హిందూ యువజన సంఘాలు, వివిధ దేవాలయాల భజన మండళ్లు, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ హైందవ సోదరులు, సోదరీమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే తాండూరు స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి హిందూ భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులను కేటాయించడం సంతోషకరమని ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని సం”లుగా హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్క హిందూ హైందవ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *