
ఎర్రరాయి అక్రమార్కులపై టాస్క్ ఫోర్స్ పంజా
👉 అసైన్డ్ భూములలో అక్రమ తవ్వకాలు?
👉5 ట్రాక్టర్లు 2 జెసిబిలు సీజ్
👉 తెలంగాణ సహజ వనరులను కర్ణాటకకు తరలింపు
👉 అధికారుల మెతక వైఖరితో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి?
నేటి ఇజం -పెద్దేముల్ : అసైన్డ్ భూములలో ఇలాంటి అనుమతులు లేకుండా సహజ వనరులను అక్రమంగా కొల్ల గొడుతున్న అక్రమార్కులపై శుక్రవారం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు.
వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశానుసారం జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ అన్వర్ పాషా నేతృత్వంలో పెద్దేముల్ మండలం తట్టేపల్లి, పాషాపూర్ తాండ పరిసరాలలోని అసైన్డ్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయిని వెలికితీస్తూ కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమార్కులపై దాడి చేసి 5 ట్రాక్టర్లు, 2 జెసిబిలను పట్టుకొని పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

