పాత తాండూరు గడీ రోడ్డు బంద్.?

పాత తాండూరు గడీ రోడ్డు బంద్.?

👉రాష్ డ్రైవింగ్ -ఇసుక ట్రాక్టర్ల రోతనలతో తీవ్ర ఇబ్బందులు అంటూ కాలనీవాసుల ఆగ్రహం.

👉 రోడ్డుపై అడ్డంగా స్తంభాలను -మొద్దులను పేర్చి నిరసన.

👉 ఇసుక ట్రాక్టర్ల మితిమీరిణ వేగంతో భయభ్రాంతులకు గురవుతున్న పాత తాండూరు గడిప్రాంత నివాస ప్రజలు.

👉 రోజూ దారి వెంబడి వెళ్లే వందల ట్రిప్పుల ట్రాక్టర్లతో దుమ్మూ -ధూళి తమ ఇళ్లలోకి వస్తుందని దుమ్ము పీల్చడంతో పిల్లలు,వృద్ధులకు అనారోగ్య సమస్యలతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

👉 వార్డు నెంబర్ 17 పాత తాండూరు గడి ప్రాంతంలోని ప్రజాభిప్రాయంతో సంతకాల సేకరణ నిర్వహించి స్థానిక తహసిల్దార్, పట్టణ పోలీసులకు వినతి పత్రం అందించేందుకు ఒకటైన కాలనీవాసులు.

👉 ఇందిరమ్మ ఇళ్లకు కేవలం 2ట్రాక్టర్ల చొప్పున మాత్రమే పర్మిషన్ ఇస్తే, మరి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యధావిధిగా ఒక్కొక్క ట్రాక్టర్ పదుల ట్రిప్పుల చొప్పున అక్రమంగా  తోడేస్తున్నారని విమర్శించారు.

👉 రోజూ పాత తాండూరు గడీ ప్రాంతం నుండి వెళ్లే ఇసుక ట్రాక్టర్లతో ఏకంగా రాష్ట్రంలోని అన్ని ఇందిరమ్మ ఇళ్లను నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు.

👉 ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ కాలనీలో నుండి ఇసుక ట్రాక్టర్లను వెళ్ళకుండా కట్టడి చేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *