పైలట్ ఇంట!పరమలించిన ఆధ్యాత్మికం
👉తాండూరు శరణు కోరుతూ మహా పడిపూజ
👉అయ్యప్ప సేవలో మాజీ ఎమ్మెల్యే దంపతులు
👉తరలివచ్చిన అశేష భక్త జనం
నేటిఇజం :తాండూరు ::తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్వగృహంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పరమలించాయి. తాండూరు ప్రజలందరూ బాగుండాలని శరణు కోరుతూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి- ఆర్తి రెడ్డి దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మార్మోగింది. మహా పడిపూజ సందర్బంగా అయ్యప్ప మాల దారులు-భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. మిరమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులలో రంగురంగుల పూలతో అలంకరించిన స్వామి 18 మెట్ల మహా పడిపూజ వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మాజీ ఎమ్మెల్యేదంపతులు నిర్వహించిన మహా పడిపూజ సందర్బంగా తాండూరు నియోజకవర్గ అయ్యప్ప స్వామి భక్తులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

