బాల్ రెడ్డి ఇంట!మార్మోగిన శరణు ఘోష
👉అయ్యప్ప నామస్వరంతో పులకరించిన సాయిపూర్
👉 స్వామివారి పూజలో తడిసి -తరించి పునీతులైన మాలధారులు-భక్తులు 
👉ఆకట్టుకున్న 18 పడిమెట్ల పూజ విధానం
👉మణికంఠుడి పూజకు హాజరైన ఎమ్మెల్యే బుయ్యని
నేటిఇజం :తాండూరు:::తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సాయిపూర్ స్వగృహం నందు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి మహా పడిపూజలో స్వామి భక్తులు ఆలపించిన భజన -భక్తి గీతాలతో మొత్తం సాయిపూర్ పులకరించి ఆధ్యాత్మిక వాతావరణంతో పరవశించిందని పేర్కొనవచ్చు. 18 మెట్ల స్వామి పడిని రంగురంగుల పూలతో కలశాల దీపాలతో అందంగా అలంకరించి తీరును – పడిపూజ నిర్వహించిన తీరును తిలకించిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలో మంత్రముగ్ధులయ్యారు .
పడిపూజ కార్యక్రమాన్ని పునస్కరించుకొని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ వివిధ పార్టీల నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

