సొంతగూటికి చేరుకున్న దొరిశెట్టి సత్యమూర్తి
👉కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
👉 ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచితస్థానం
👉 ప్రతిపక్షాల కల్లబెల్లి మాటలు పట్టించుకోవద్దు
👉 ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 
నేటి ఇజం తాండూరు: గత మున్సిపల్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించి తాండూరు పట్టణం 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి గత కొంతకాలంగా తాండూరు నియోజకవర్గ బి ఎస్ పి పార్టీలో కొనసాగుతున్న దొరిశెట్టి సత్యమూర్తి సోమవారం సొంత గూడులాంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దొరిశెట్టి సత్యమూర్తిని కండువా వేసి స్థానిక శాసన సభ్యులు మనోహర్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాత కొత్త అని వ్యత్యాసం లేకుండా నాయకులందరూ కలిసికట్టుగా రాబోవు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు- నాయకులకు సూచించారు. పార్టీలో చేరిన దొరిశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి గడపగడపకు చేరవేసి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం పార్టీలో చేరిన దొరిశెట్టి సత్యమూర్తి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని శాలువాతో సన్మానించి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు 23వ వార్డు సీనియర్ నాయకులు వార్డు ఇన్చార్జ్ భరత్ రెడ్డి,బోయ సుదర్శన్, మహిళా నాయకురాలు మాధవి వార్డు ప్రజలు తదితరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

