గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహణకు కృషి
👉భాధ్యతలు స్వీకరించిన కరణ్ కోట్ నూతన ఎస్సై
👉 శాంతిభద్రతల పరిరక్షణ నా కర్తవ్యం
👉 నూతన ఎస్సై రాథోడ్ వినోద్
నేటి ఇజం తాండూరు రూరల్: తాండూరు మండలం రూరల్ పోలీస్ స్టేషన్ అయినటువంటి కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రాథోడ్ వినోద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై రాథోడ్ వినోద్ మాట్లాడుతూ శాంతిభధ్రతలను పరిరక్షించడమే తన కర్తవ్యమని అన్నారు. అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి చైతన్యవంతులుగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

