ఝాఠా కేసులను తాండూరు జాంతా నహీ!
👉ప్రజలు అంతా గమనిస్తున్నారు.
👉రాబోయేది బి ఆర్ ఎస్ పార్టీనే!
👉ప్రభుత్వంలో కాబోయే మంత్రి.
👉బి ఆర్ ఎస్ నాయకులు.
నేటి ఇజం తాండూరు :అక్రమంగా నమోదు చేసిన ఝాఠా కేసులను తాండూరు ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు.బుధవారం జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అలాగే బిఆర్ఎస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చే బిఆర్ఎస్ ప్రభుత్వంలో పైలెట్ రోహిత్ రెడ్డి మంత్రి పదవి స్థానాన్ని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు అవుసుల యోగానంద్, జావీద్ నాయకులు సంతోష్ గౌడ్, రుద్రు పాటిల్,అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

