కనిపించని నాలుగో సింహానికి– తోడుగా నిలిచిన మూడో కన్ను!

కనిపించని నాలుగో సింహానికి! తోడుగా నిలిచిన మూడో కన్ను!

 

👉7వ తారీఖు జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేదించిన పోలీసులు.

👉 రెండు తులాల పుస్తెలతాడు-16 సన్నని గుండ్లు రికవరీ!

👉 నలుగురు దొంగల అరెస్ట్! రిమాండ్ కు తరలింపు, నాలుగు ఫోన్లు స్వాధీనం!

👉మారుమూల ప్రాంత ఎస్సై విట్టల్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ మొయినాబాద్ లో సంచలనం!

👉గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసు పరిష్కారం.. ఎస్సై విట్టల్ రెడ్డి విధి నిర్వహణలో కర్తవ్య ప్రతిభ.

👉 సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు- అరెస్ట్- రిమాండ్- సొమ్ము రికవరీ చకచకా..

👉 కేవలం 4గంటల్లోనే కేసును ఛేదించి జిల్లా ఎస్పీ ప్రశంసలు పొందిన వైనం.

👉 ఎలాంటి ఆధారం లేదు… సీసీ కెమెరాలే ఎస్సై విట్టల్ రెడ్డి మూడో చూపు!

👉7వ తేదిన జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన తాండూరు బస్టాండ్ నుండి కందనెల్లి,ముంబాపూర్, ధారూర్ వికారాబాద్, మన్నెగూడ,చేవెళ్ల చివరగా మొయినాబాద్ తదితర మూడో కన్ను నిఘా పర్యవేక్షణలో సఫలీకృతుడై కేవలం 4 గంటలలోనే నిందితులను అదుపులో తీసుకున్న తీరు యావత్ తెలంగాణ పోలీసులకే  దక్కిన గౌరవం !

👉 ఇయ్యాల ఎస్సై విటల్ రెడ్డి కిమ్ కర్తవ్యం లో నాడు ఎంతో సంచలనం సృష్టించిన తాండూరు గౌతాపూర్ లగ్జరీ కార్లలో గొర్రెల దొంగతణాన్ని చేదించిన తీరు…. నేడు మహిళా గొంతులోని చైన్ స్నాచింగ్ దొంగతనం తీరును ఒకే కోణంలో చూస్తూ అణువణువూ పరిశీలిస్తూ నిందితులను అదుపులో తీసుకున్న తీరు ఎస్సై విటల్ రెడ్డి కర్తవ్య దీక్షకు నిదర్శనం!

👉 అక్రమ ఇసుక రవాణాను ఎవరైనా అడ్డుకుంటారు? కానీ అంతర్ రాష్ట్ర దొంగలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రానికి సవాలు విసురుస్తున్న చైన్ స్నాచింగ్ ముఠాను కేవలం 4 గంటలలోనే అదుపులోకి తీసుకోవడం పట్ల ఎస్సై విట్టల్ రెడ్డి అలాగే రూరల్ క్రైమ్ సిబ్బందిని బాధితులతో పాటు పలువురి ప్రజల నుండి అభినందనలు సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *