తాండూరుకు దూరంగా ఉన్నత విద్యా..
👉కనీసం డిగ్రీ తర్వాత పిజీకోర్సు కు నోచుకోని వైనం
👉కంది పంటకు బౌగోలిక గుర్తింపు వచ్చినా! జాడ లేని వ్యవసాయ పాలిటెక్నిక్
👉జాడ లేని వందల కోట్ల ఆదాయం తెచ్చే మైనింగ్ కళాశాల
👉 దశాబ్దాలు దాటినా తీరుమారని తాండూరు విద్యావ్యవస్థ
👉 ప్రైవేటు స్కూళ్లు కళాశాలలో అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయాలి?
నేటి ఇజం :తాండూరులో ఉన్నత విద్య అందని ద్రాక్ష లా మారిందా అంటే అవుననే అనాలి. తాండూరు ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికై వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం హైద్రాబాద్ అలాగే ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళవలిసి వస్తుందని ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ అన్నారు. ముఖ్యంగా విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక అనుకూల పరిస్థితులు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరులో విద్యార్థుల సౌకర్యార్థం ఉన్నత విద్యకై ముఖ్యంగా *ప్రభుత్వ పీజీ కాలేజి,* ఇంజనీరింగ్, ఫార్మసీ,పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ లాంటి విద్యాసంస్థల ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంది తాండూరు విద్యార్థులు ఉన్నత విద్యను అవకాశం లభిస్తుందని విద్యావంతులవుతారని సూచించారు. ముఖ్యంగా విద్యార్థినులకు చాలా మేలు జరుగుతుందని అలాగే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో పారమెడికల్ కోర్సులు ప్రవేశపెట్టాలని, ఆవకాశముంటే కేంద్ర సైనిక్ స్కూల్,వ్యవసాయ పాలిటెక్నిక్,మైనింగ్ కళాశాల లాంటివి ఏర్పాటు చేస్తే విద్యాభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూరు విద్యాభివృద్ధికికై, తాండూరులో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే తాండూరులోని ప్రైవేటు స్కూళ్లు -కళాశాలలో అధిక ఫీజుల వసూళ్లను సైతం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

