వార్డు నం 36 బరిలో బిర్కెడ్ ఉషా వినయ్?

వార్డు నం 36 బరిలో బిర్కెడ్ ఉషా వినయ్

👉 గతంలో మాజీ కౌన్సిలర్ కోఆప్షన్ మెంబర్ అనుభవం 

👉 కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కు ఆర్జీ

నేటి ఇజం తాండూరు :: తాండూర్ పట్టణం వార్డ్ నెంబర్ 36 నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉంటానని మాజీ కౌన్సిలర్ -కో ఆప్షన్ నెంబర్ బిర్కెడ్ ఉష వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ కుటుంబ నేపథ్యం గల భరత్ భూషన్ కోడలుగా వార్డు ప్రజలందరికీ సుపరి చితురాలినని గతంలో వార్డు కౌన్సిలర్ గా అలాగే మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ గా చేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. అలాగే గత ఎన్నికలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని కావున 36వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *