నూతన కాలమానాలను పంపిణీ చేసిన సత్యమూర్తి
👉సంక్రాంతి ముగ్గుల రంగుల పంపిణీ కూడా
నేటి ఇజం తాండూరు:: నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని వాల్మీనగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి బుధవారం రంగు రంగుల ముగ్గుల పాకెట్స్ తో పాటు నూతన సవంత్సర క్యాలండర్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దొరిశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను వార్డు ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు తమ ఇంటి ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేయడం జరుగుతుందని కావున వాల్మీకి నగర్ మహిళా సోదరీమణులకు తన వంతు సహాయంగా ముగ్గు- రంగులను అందించడం అదృష్టమని అన్నారు.

