స్కార్పియోలో మేకలకు ఉచిత ప్రయాణం
👉సంక్రాంతి పండుగ వేళ.. దొంగల బంపర్ ఆఫర్
👉 స్కార్పియో వాహనంలో వచ్చి మేకల అపహరణ
నేటి ఇజం ::బషీరాబాద్ బషీరాబాద్ మండల పరిధిలోని మల్కన్ గిరి నర్సప్పకు చెందిన 04, కంసాన్ పల్లి ( మక్త) కురువ మాసప్పచెందిన 20మేకలు రెండు గ్రామాలలో మొత్తం 24 మేకలను మంగళవారం అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో తీసుకెళ్లినట్లు సమాచారం .. గతంలో కూడా తాండూర్ మండలం గౌతపూర్ గ్రామంలో ఇదేవిధంగా స్కార్పియో వాహనంలోనే మేకల దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. నాడు ఆ కేసును ఎంతో చాకచక్యంతో వివరించిన ప్రస్తుత యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే..
👉 స్కార్పియో వాహనంలో మేకలను దొంగతనం చేయడం పట్ల మేకల కాపలాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

