♠విధి నిర్వహణలో ఉత్సాహన్నీ నింపే రివార్డులు
👉24 గం “లలో కేసును చేదించిన రూరల్ క్రైమ్
👉 ఎలాంటి సంఘటన జరగకుండా ఆరుగురు నిండుతుల అరెస్ట్ లో కీలక పాత్ర!!
నేటి ఇజం :తాండూరు ::తాండూరు రాజీవ్ కాలనీలో జరిగిన హత్య నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవవరించిన క్రైమ్ పోలీసులకు పోలీసు శాఖ తరుపున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
గత నెల 26వ తారీకు యాలాల మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని చికెన్ సెంటర్దగ్గర జరిగిన హత్య కేసులో నూర్ అహ్మద్ మరణించిన సంగతి విధితమే. జరిగిన హత్య ఉదంతం కేసు నిందితుల గాలింపు చర్యలలో తాండూరు రూరల్ క్రైమ్ పోలీసులు ఉత్తమ పనితీరు ప్రదర్శించి 24 గంటల్లోనే ప్రధాన నిందితులైన ఆరుగురు నిందితులను అరెస్టు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాండూరు రూరల్ క్రైమ్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్స్ దస్తప్ప,మున్నయ్య, కానిస్టేబుల్ ప్రతాప్ తదితరులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం కేసు చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాండూరు రూరల్ క్రైమ్ పోలీసులకు నగదు ప్రోత్సాహక రివార్డులను అందజేస్తూ… విధినిర్వణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

