రాజ్యాధికార దిశగా బీసీల అడుగులు

రాజ్యాధికార దిశగా బీసీల అడుగులు

👉జిల్లాలోనే అత్యధిక స్థానాల్లో బీసీ సర్పంచుల విజయం

👉కిమా కిచిడి పోస్టులకు స్పందించే బీసీలు?

👉అదే బీసీ స్మశానవాటిక విషయంలో స్పందన కరువు.?

👉తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్

👉ప్రతి సర్పంచ్ రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవాలి

👉 అడిషనల్ ఎస్పీ జి. మధుసూదన్ రావు

👉తాండూర్‌లో 67 మంది బీసీ సర్పంచులకు ఘనంగా సన్మానించడం ఎంతో గర్వకారణం

నేటి ఇజం తాండూరు:: తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి తాండూరు, యాలాల్, బషీరాబాద్, పెద్దెముల్ మండలాల నుండి ఎన్నికైన బీసీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి. మధుసూదన్ రావు హాజరయ్యారు. అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ జయప్రసాద్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా వివిధ కులాల వారీగా ఉన్న బీసీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బీసీ సంఘం నాయకులను అభినందించారు. రాబోయే రోజుల్లో సర్పంచ్‌లకే కాకుండా జడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి, జనరల్ వార్డుల్లో గెలుపు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకుర్, గడ్డం వెంకటేష్, విజయేందర్, కేఎన్ రాజు, న్యాయవాదులు గోపాల్, దిలీప్ సింగ్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచులు పండరి, రాజ్ కుమార్, భార్గవి, బీసీ సంఘం మండలాల అధ్యక్షులు నరేందర్ లక్ష్మణా చారి, శ్రవణ్ కుమార్, బసంత్ కుమార్, బీసీ సంఘం యువ నాయకులు బసవరాజ్, రాము ముదిరాజ్, పరమేష్, దుబాయ్ వెంకట్, హరి ప్రసాద్, పండు గౌడ్, మహిళా ప్రతినిధులు అనిత, మంజుల, నరసమ్మ,జగదీశ్వరి,మధులత శ్రీనివాస్ చారి, శివ లీల, విజయలక్ష్మి, జగదీశ్వరి, కుల సంఘాల ప్రతినిధులు రాజు యాదవ్, పరమేష్ నాయి, రజక కృష్ణ,కమలాకర్,అరుణ్ రాజ్,ఏలేటి శ్రీనివాస్, నవీన్, టేలర్ రమేష్,గోపాల్, డాక్టరేట్ నర్సింలు, దవులయ్య తదితరులు పాల్గొని సర్పంచ్లను ఘనంగా సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *