భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం.!

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం.!

👉అయ్యప్ప స్వామి సేవలో ముస్లిం సోదరులు.

👉కరణ్ కోట్ మణికంఠ ఆశ్రమంలో అన్నదాన వితరణ 

👉హర్షం వ్యక్తం చేసిన ప్రజలు -భక్తులు.

నేటి ఇజం :తాండూరు :: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా కరణ్ కోట్ ముస్లిం సోదరులు నిలిచారు. శనివారం కరణ్ కోట్ మణికంఠ ఆశ్రమంలో అయ్యప్ప మాల ధరించి, స్వామి దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు కరణ్ కోట్ గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు రఫీ -వజీర్ ఇద్దరూ అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి తమ తమ సాంప్రదాయాల ప్రకారం అన్నీ పండుగలను గౌరవిస్తూ! సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టడంపై ప్రజలు, స్వామి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *