బుల్లెట్ రోతలపై!పోలీస్ రాతలు?

బుల్లెట్ రోతలపై!పోలీస్ రాతలు?

👉బుల్లెట్ పొగ గొట్టాలకు! పోలీస్ అడ్డుకట్ట 

👉శబ్ద కాలుష్యంపై.. కసిగా పోలీస్ శబ్దం

👉 పలు బుల్లెట్ వాహనాలు సీజ్! కేసులు నమోదు.

👉 రోడ్లపై విన్యాసాలు చేసే ఆకతీయుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ యోచనలో పోలీస్ 

నేటి ఇజం :తాండూరు ::: తాండూరు పట్టణ ప్రధాన రోడ్లపై బుల్లెట్ వాహనాల రోదనాలతో తీవ్ర శబ్ద కాలుష్యానికి కారణం అవుతూ, ఆకాతాయి చేష్టలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా జాయ్.. జాయ్ మంటూ తిరిగే జులాయిల భరతం పట్టేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. ఈ సందర్భంగా శనివారం తాండూరు పట్టణంలో ప్రధానంగా బుల్లెట్ వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పలు బుల్లెట్ వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడే బుల్లెట్ పొగ గొట్టాలను అమర్చుకొని రోడ్లపై తిరిగుతూ.. ప్రజలకు ఇబ్బందికరంగా శబ్ద కాలుష్యానికి పాల్పడే ఆకతాయులపై చర్యలు తీసుకుంటామని అలాగే తల్లిదండ్రులను సైతం స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు. కావున బుల్లెట్ వాహనాల పొగ గొట్టాలను అక్రమంగా అమర్చుకుని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా చట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *