కుమారుడి పుట్టినరోజు!రామ మందిర సేవలో!
👉 ₹20116 రూ “ల విరాళం అందించిన భరత్ రెడ్డి
👉 అయోధ్య రామ మందిర నమూనాతో నిర్మాణం అభినందనీయం
నేటి ఇజం :తాండూరు::: తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామ మందిరానికి భక్తులు విరాళాలు అందిస్తూ భక్తిభావం చాటుకుంటున్నారు.శ్రీ రామ మందిరం ఆలయ పునర్నిర్మాణం కోసం దేవాలయ కమిటి సభ్యులు దాతల నుంచి తోచిన విరాళాలను సేకరిస్తున్నారు.
శుక్రవారం తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు 23వ వార్డు ఇంచార్జ్ భరత్ రెడ్డి తన కుమారుడు శాశ్వత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా దేవాలయ పునర్ నిర్మాణం కోసం తన వంతుగా రూ. 20116 వేలను దేవాలయ కమిటి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలోని రామ మందిరం నమూనా తరహాలో ఆలయ కమిటీ సభ్యులు అత్యంత సుందరంగా నిర్మించేందుకు కృషి చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.అలాగే హైందవ సోదరులందరూ విధిగా తమకు తోచినంత సహాయం అందించి రామ మందిర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

