ముగ్ధ (మనోహర)మైన మహా పడిపూజ
👉స్వామి వారి పడిపూజ అత్యంత మనోహరం
👉 ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న వేళ!
👉 అయ్యప్ప స్వామి దేవాలయంలో మార్మోగిన శరణు ఘోష.
👉 ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి పడిపూజ
👉 అశేషంగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి మాలాదారులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు
నేటి ఇజం :తాండూరు ::: తాండూరు శాసనసభ్యులు బియ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఆ మహా మణికంఠుడి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా జరిగింది. పేరొక్క రంగురంగుల పూలు, పండ్లతో అలంకరించిన స్వామివారి మహా పడి 18 మెట్ల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామివారి పడిపూజ సందర్భంగా భక్తులు ఆలపించిన గీతాలతో మైమరిచి ఆధ్యాత్మిక దైవచింతనకులో శరణు ఘోష తన్మయం పొందిన తత్వానికి విరాజిల్లిన వైనం అయ్యప్ప స్వామి భక్తులకు సొంతమయ్యాయని పలువురు పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, శ్రేయోభిలాషులు, అయ్యప్ప స్వామి మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

