బిఆర్ఎస్ పార్టీకి తలాక్! మైనార్టీ నేత నయీమ్( ఆఫ్ఫు)
👉7 సం”రాల 7 అడుగుల సుదీర్ఘ బంధానికి తలాఖ్ చెప్పిన మైనార్టీ నేత.
👉 మున్సిపల్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి దూరం కావడం లాభమా- నష్టమా?
👉సొంత గూటి చేయి పట్టుకున్న నయీమ్ (ఆఫ్ఫు)
👉 ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం
నేటి ఇజం :తాండూరు :: రాజకీయ నాయకులు ఎప్పుడు, ఏ సమయాన ఏ కండువా వేసుకొని ఏ పార్టీలో చేరుతారో ఎవరికి తెలియదు! అనే నాణుడి మళ్ళీ నిజమైంది.బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీమ్ (ఆఫ్ఫు) మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ పార్టీతో ఉన్న ఏడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నేడు మంగళవారంతో ముగిసింది.తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులోని నయీమ్ (ఆఫ్ఫు) నివాసంలో మంగళవారం ఒకప్పటి మాతృ పార్టీ ఐన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..
గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను నిర్వహించి జిల్లాస్థాయి నుండి రాష్ట్ర మైనార్టీ నేత స్థాయి వరకు ప్రత్యేక గుర్తింపు నయీమ్ (ఆఫ్ఫు) సొంతం చేసుకున్నారు.

