ఉర్దూ ఘర్ చైర్మన్ గా సయ్యద్ జలాల్ నియామకం.

👉25సం”రాల సేవకు దక్కిన ఫలితం

👉హర్షం వ్యక్తం చేసిన నాయకులు- అభిమానులు

నేటి ఇజం-తాండూరు: గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అభ్యున్నతికై చేసిన కృషికి ఫలితమే నేడు తాండూరు ఉర్దూఘర్ చైర్మన్ పదవి లభించడం ఎంతో సంతోషకరమని నూతన చైర్మన్ సయ్యద్ జలాల్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించిన 2017 కు ముందు వరకు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకే పదవులు లభిస్తాయని పేర్కొన్న విషయం విధితమే. అందులో భాగంగానే నేడు ఉర్దూఘర్ చైర్మన్ పదవి పార్టీకి సేవ చేసిన నిజమైన నాయకులకే దక్కిందంటూ పలువురు నాయకులు- కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ సయ్యద్ జలాల్ మాట్లాడుతూ పదవి లభించడంతో బాధ్యత మరింత పెరిగిందని రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి మరింత కష్టపడతాననిఅలాగే పదవి లభించేందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఆమెర్ అబ్దుల్లా, హబీబ్ లాల ఇతర సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన మహమ్మద్ ఫెరోజ్ ఖాన్.. సమియోద్దీన్, ఎండి ఫయాజ్.. నవాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *