నిరంకుశ పాలన సంకెళ్లకు విముక్తి
👉ఏ ఎమ్ సి చైర్మన్ బాల్ రెడ్డి
👉 ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
నేటి ఇజం తాండూరు: నిజాం నవాబులు – రజాకర్ల నిరంకుశ పాలన సంకెళ్ళకు విముక్తి లభించిన సందర్భం తెలంగాణ విమోచన దినోత్సవమని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా తాండూరు మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో పాలకవర్గం,అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ 15ఆగస్టు 1947 సం”లో యావత్ భారతదేశం స్వాతంత్రపు స్వేచ్ఛను ఆనందంగా వేడుకలు నిర్వహించుకుంటే నిజాం నవాబులు, రజాకర్ల నిరంకుశ పాలనలో తెలంగాణకు మాత్రం స్వాతంత్రం లభించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

