సెయింట్ మార్క్స్ స్కూల్ లో షి టీమ్ అవగాహన సదస్సు

👉ఫోక్సో కేసులు & బాలికల మిస్సింగ్ కేసులు తగ్గిద్దాం,

👉సెయింట్ మార్క్స్ స్కూల్ లో అవగాహన సదస్సు
👉 ఫోక్సో- మిస్సింగ్- డయల్ 100 కేసులపై ప్రచారం
👉 చైల్డ్ లైన్ నంబర్ 1098 పై విస్తృత ప్రచారం
👉 అలరించిన షీ టీమ్- కళాజాత బృందాల పాటలు

నేటి ఇజం. తాండూరు: వికారాబాద్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో తాండూరు ఎస్సై పుష్పలత వికారాబాద్ జిల్లా కళా బృందం ఇంచార్జ్ అశోక్ అలాగే తాండూరు డివిజన్ షి టీం ఇంచార్జీ శేఖర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ పాఠశాలలో సోమవారం అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు..
ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పలువురు మాట్లాడుతూ
👉రాష్ట్రంలో అత్యధిక మైనర్ బాలికలు సరియైన అవగాహన లేకపోవడం వలన ఇల్లు వదిలి వెళ్లిపోవడం జరుగుచున్నదని అన్నారు.
18 సంవత్సరాల లోగల బాలికలు తమంతట తాము వెళ్లిపోయిన లేదా ఎవరైనా వారిని అపహరించినా దానికి కారణం అయిన నేరస్థుడిపై పోక్సో కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.సమాజంలో
బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే వెంటనే చైన్ లైన్ 1098 కి సమాచారం అందించాలని తెలిపారు.
డయల్ 100 / మానవ అక్రమ రవాణాను అరికట్టడమే ముఖ్య కర్తవ్యమని అన్నారు.
అలాగే
సైబర్ క్రైమ్ నిరోధించడానికి యువత, ప్రజలు ఎప్పటికప్పుడు.!తాము మోసపోయినట్లయితే సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *