ఓ అంబేద్కరా! ఆర్ & బి కళ్ళు తెరిచింది?

ఓ అంబేద్కరా! ఆర్ & బి కళ్ళు తెరిచింది?

👉గత కొన్ని రోజులుగా మీ ముందున్న గుంతకు మోక్షం

👉 మరి మంత్రులు వస్తున్నారంటా సామి 

👉 ప్రమాదలను చూస్తూ తమరు పడ్డ మనోవేదనకు ఫుల్ స్టాప్

నేటి ఇజం : భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డు పై గత కొన్ని రోజులుగా చిన్న గుంత నుండి పెద్ద గుయ్యిలా మారి వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసిన ఆ గుంత రేపు మంగళవారం తాండూరు పర్యటనకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో సోమవారం మోక్షం లభించింది. గత కొన్ని రోజులుగా సాక్షాత్తు తమ విగ్రహం ముందు వాహన దారులు, బాటసారులు అనుభవించిన భాదలకు నేటితో స్వస్తి. గత కొన్ని రోజులుగా బస్టాండ్ ముందరగల అంబేద్కర్ విగ్రహం ముందు ఏర్పడిన గుంతను పట్టించుకోని ఆర్ &బి అధికారులకు రేపు మంత్రులు వస్తున్నారని ఈరోజు కనిపించడం గమనార్హమని పలువురు వాహనదారులు పేర్కొనడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *