ప్రభుత్వ కళాశాల విద్యార్థిణీల ఔదార్యం
👉 మతిస్థిమితం లేని మహిళకు సహాయం
👉 విద్యార్థి దశలోనే సహాయం అందించిన ఆ చేతులు
👉24గంటలూ రీల్స్ అంటూ సెల్ ఫోన్ కు బందీ ఐన యువతకు ఆదర్శం
నేటి ఇజం తాండూరు: కళాశాలకు వచ్చామా- వెళ్ళామా? 24 గంటలూ సెల్ ఫోన్ లో రీల్స్ చేస్తూ ఎవరు ఏ ఇబ్బందలు పడితే మనకెందుకు అనే ధోరణిలో నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ అవలంబిస్తున్న దినచర్య.. కానీ తాండూరు జూనియర్ కళాశాల ముందు వర్షంలో తడుస్తూ మతిస్థిమితం లేని ఓ అభాగ్యురాలును చూసి చలించిన ఆ విద్యార్థిణిల మనస్సు ఏదైనా సహాయం చేయాలని తపిస్తూ ఖర్చుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఇచ్చిన కొద్దిపాటి డబ్బులను తలా కొద్దిగా వేసుకొని వర్షంలో తడుస్తున్న ఆ మహిళలకు తడవకుండా ప్లాస్టిక్ కాగితం కొని తీసుకొని అందిస్తూ విద్యార్థి దశలోనే తమ గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే తినడానికి సైతం అల్పాహారాన్ని అందించి తమ ఔదార్యం చూయించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిణి లు నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని దారి వెంబడి వెళ్లే పలువురు బాటసారులు హర్షం వ్యక్తం చేశారు .


