30 ఇయర్స్ ఇండస్ట్రీ పదానికి అంతిమ యాత్ర?

30 ఇయర్స్ ఇండస్ట్రీ పదానికి అంతిమ యాత్ర

👉పల్లెల్లో వికసించిన యువ వికాసం!

👉 దశాబ్దాలుగా పల్లెల్లో గుత్యాధిపత్యానికి చెక్ పెట్టిన యువత

👉 మాకు తిరుగులేదు అనే వాళ్లను?ఎలాంటి అనుభవం లేని యువత చేతిలో! మసైపోయిన వైనం.

👉గ్రామ పంచాయతీ పోరులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో.. మండలాల్లో అగ్రనాయకులకు ఇకనైనా కావాలి కనువిప్పు..

👉కొత్తవాళ్లకు అవకాశం ఇస్తాం.. మీరు తప్పుకోండి ఇక అన్నట్టు ఉంది గ్రామాల్లో ప్రజా తీర్పు.

👉40సం”రాల పాలన ఉన్న చరిత్ర గల…సంఘం కలాన్ లో మాజీ ఎంపిపి, డీసీసీబీ వైస్ చెర్మెన్ రవి గౌడ్

👉యాలాలలో సిద్రాల శ్రీనివాస్- బాలేశ్వర్ గుప్తా ?

👉పెద్దేముల్ లో డి సి సి అధ్యక్షుడు ధారాసింగ్?

👉బషీరాబాద్ లో మాజీ ఎంపిపి కుటుంబం అజయ్ ప్రసాద్?

👉 తాండూరు దశలు మారుస్తామన్న… నాయకులకే తమ దిశను గుర్తు చేసిన యువతరం 

నేటి ఇజం తాండూరు:: తాండూరు నియోజకవర్గంలో ఈ సారి స్థానిక సంస్థ ఎన్నికలైన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో విలక్షణ తీర్పు… మాకు తిరుగు లేదు అని అనుకునే నాయకులను మట్టికరిపిస్తూ హెచ్చరికను జారీ చూశారనడంలో అతిశయోక్తి లేదు.

*తాండూరు మండలం* సంగేమ్ కలాన్ గ్రామంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్ కుటుంబానికి దాదాపు 40ఏళ్ల తరువాత గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం…. రాజకీయ అనుభవం లేని సామాన్య యువకుడు ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించడంతో గ్రామాలలో ప్రజలు మార్పు కోరుతూ యువతకు పట్టం కట్టారని తేటతెల్లమైంది.ఇక జినుగుర్తి గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్ కుటుంబసభ్యులపై రాజకీయ అనుభవం లేని చదువుకున్న యువకుడు పోటీ చేసి 508 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు..చెంగోల్ లో అన్నీ పార్టీలను కాదని యువకుడైన ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించిన ఓటర్లు.

*పెద్దేముల్ మండలంలో* అధికార పార్టీకి భారీ ఎదురుదెబ్బే తలిగింది..వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ధారసింగ్ మండల కేంద్రంతో పాటు గ్రామాలలో సుడిగాలి ప్రచారం చేసిన కూడా తండాలు ‘చే’జారినాయి.. పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రేస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లిన డి వై చిన్న నర్సిములు భారీ మెజారిటీతో విజయంతో కాంగ్రేస్ కంచుకోటకు బీటలు వాలయని పేర్కొనవచ్చు. ఇదిలా ఉండగా మాంబాపూర్ గ్రామంలో 200పై చిలుకు ఓట్లతో కాంగ్రేస్ సీనియర్ నాయకునిపై కాంగ్రేస్ రెబెల్ గా బీఆర్ఎస్ మద్దతుతో యువ నాయకుడు శ్రీనివాస్ అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో గులాబీ కండువా వేసుకున్నారు. 

*యాలాల మండలం* ఒకే తీర్పుతో ఇద్దరు అగ్రనాయకులకు ఇరుకున పడేసిన యాలాల గ్రామ ప్రజలు వినూత్నమైన తీర్పునిచ్చారు.సిద్రాల శ్రీనివాస్, బాలేశ్వర్ గుప్త ఇద్దరు కలిసినా కూడా (బిఆర్ఎస్,బిజెపి ఒక్కటైనా)బీజేపీ గెలిచే సీటు త్యాగం చేసినా యాలాల గ్రామ పంచాయతీపై భారీ అధిక్యంతో కాంగ్రెస్ జెండా ఎగిరింది..ప్రజలు విజ్ఞులు అని మరో సారి రుజువు అయ్యింది.

*బషీరాబాద్ మండలంలో* బషీరాబాద్ గ్రామ పంచాయతీ పోరులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహరాజ్ గెలుపు..సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్ అన్న కొడుకు ఓటమి..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ ఆధిక్యం.. పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ మండలంలో ఎక్కువ గ్రామ పంచాయితీలు గెలవడానికి కాంగ్రేస్ వర్గపోరు కారణం కావొచ్చు..

ఏదేమైనా ఈ ఎన్నికలో అన్నీ పార్టీలకు తమదైన రీతిలో యువత ఇచ్చిన తీర్పు మార్పు కు నాంది పలుకుతూ యువకులకు,కొత్తవారికి పట్టం కట్టారు. ఏది ఏమైనా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పదానికి అంతిమ…… యాత్ర నిర్వహించాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *